మలక్‌పేట, జూన్ 26: తల్లిదండ్రుల ఆస్తులనే అనుభవిస్తూ వారినే ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు కొందరు. తాజాగా సైదాబాద్ మండలం తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం..ముసారాంబాగ్ ఈస్ట్ప్రశాంత్నగర్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. భర్త చనిపోవడంతో తన ఇంట్లో కొడుకులతో కలిసి నివాసముండేది. ఆ తర్వాత వృద్ధురాలైన తల్లి ఆలనాపాలన చూడాల్సిన కుమారులు ఆస్తిని లాక్కొని వెళ్లగొట్టారు.
దాంతో సైదాబాద్‌లోని తన చిన్న కూతురు వద్ద ఉంటున్న శకుంతల బాయి, తన బాగోగులు చూడని కుమారులు నా ఇంట్లో ఉండొద్దని, ఇల్లును తనకు స్వాధీనం చేయాలని 2024 ఫిబ్రవరిలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ఆర్డీవోను ఆశ్రయించింది. అధికారులు కుమారులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చినా మార్పురాలేదు. రెండురోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దాం తో గురువారం తహసీల్దార్ ఇబ్బందితో వచ్చి ఇంటిని సీజ్ చేసి శకుంతల బాయికి అప్పగించారు.