మొయినాబాద్, మార్చి 9: ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి తమ జీవితాలను మార్చుకోవాలని టీ-హబ్ వింగ్ కమాండర్ అనీష్ఆంటోనీ అన్నారు. గురువారం అమ్డాపూర్లోని జేబీఐఈటీలో టీ-హబ్ సౌజన్యంతో కిక్-స్టార్ట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంటోనీ మాట్లాడుతూ విద్యార్థులకు వచ్చే ఆలోచనలకు ఓ రూపం ఇస్తే మంచి ఆంత్రప్రెన్సూర్గా మారడం ఖాయమన్నారు. జేబీ విద్యాసంస్థ కార్యదర్శి జేవీ కృష్ణారావు మాట్లాడుతూ టీ-హబ్తో ఒప్పందం చేసుకున్న తొలి ఇంజినీరింగ్ కాలేజీ జేజీఐఈటీ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
విద్యార్థుల ఆలోచనలకు టీ-హబ్ ఓ కార్యరూపం ఇచ్చేందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్నదన్నారు. జేబీ గ్రూప్ మెంబర్ మేనేజ్మెంట్ డాక్టర్ బి.దీపిక మాట్లాడుతూ జేబీ గ్రూపు కింద అన్నా కాలేజీలను ఏర్పాటు చేయడం జేబీ గ్రూప్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు జే భాస్కర్ రావు ఆశయమని గుర్తు చేశారు. జేబీ విద్యా సంస్థల కార్యదర్శి జేవీ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేబీ గ్రూప్ సీఈవో డాక్టర్ దసక, ప్రిన్సిపాల్ డాక్టర్ పీసీ కృష్ణామాచారి పాల్గొన్నారు.