సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): స్పేస్ టెక్నాలజీలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు టీహబ్ (T Hub) ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నిపుణులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని టీహబ్ ప్రతినిధి తెలిపారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న స్పేస్ టెక్నాలజీతో(Space technology) ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు స్టార్టప్‌లు తమ కార్యక లాపాలను ప్రారంభించి, మంచి ఫలితాలను సాధించాయి.
ఈ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేసేందుకు అవకాశం ఉందని స్పేస్ టెక్నాలజీ నిపుణులు చెబుతుం డడంతో ఔత్సాహికులైన స్టార్టప్ వ్యవస్థాపకులకు అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 20న టీ హబ్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.‘ సస్టెయినబిలిటీ ఇన్ స్పేస్’ అనే అంశంపై వయా శాట్ కంపెనీ అధ్యక్షుడు గురు గౌరప్పన్, సీఈఓ మార్క్ డాంక్బర్గ్, సీడీఓ రవి వర్మ నంబూరిలు ప్రసంగిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు, పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ కింది లింకు (https://tevents.t-hub.co/SustainabilityinSpace )లో సంప్రదించాలని సూచించారు.