ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్లండి

సిటీబ్యూరో, నవంబరు 3 (నమస్తే తెలంగాణ): ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా టీ-హబ్ ఏర్పాటైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ ప్రధాన పెట్టుబడిగా పెట్టి సరికొత్త ఆవిష్కరణలు చేసే వారికి అండదండగా నిలిచింది టీ హబ్. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, త్రిపుల్ ఐటీ హైదరాబాద్, నల్సార్ విశ్వవిద్యాలయంలో పాటు మరికొన్ని కంపెనీల సహకారంతో ఏర్పాటు చేశారు. టీ హబ్ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకుంది. స్టార్టప్ ఎకో సిస్టింను అభివృద్ధి చేయడంతో మొదట్లో 400గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం 2000దాకా పెంచారు. మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఇచ్చేందుకు టీ హబ్ 2ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాంటి టీ హబ్ నవంబర్ 5 నాటికి 6 ఏళ్లు పూర్తి చేసుకుంది.
టీ హబ్ పురోగతి ఇలా….
- టీ హబ్‌లో ఇప్పటి వరకు 1800 స్టార్టప్‌లకు సహాయ సహకారాలను అందాయి.
- విజయవంతమైన స్టార్టప్‌లకు రూ.2269 కోట్ల ఫండింగ్ వచ్చింది. ఇందులో ప్రధానంగా జెనోటి, మైగేట్, విజిల్ డ్రైవ్, అవుట్‌ప్లే, డ్రింక్ ప్రైమ్, యాడ్ ఆన్మో వంటి వాటికి పెద్ద మొత్తంలో ఫండింగ్ లభించింది.
- టీ హబ్ ద్వారా సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసే కార్యక్రమాలను చేపట్టారు. వీటిలో ఫేస్బుక్, ఉబర్, హెచ్‌సీఎల్, బోయింగ్, మైక్రోసాప్ట్, క్వాల్కామ్లు ఉన్నాయి. వీటికి తోడు 26 కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించగా, 4100 దరఖాస్తులు వచ్చాయి.
- సేవల రంగంలో ఉన్న సుమారు 75 కంపెనీలతో టీ హబ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో పేటీఎమ్, ఆర్బీఎల్ బ్యాంక్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డిజిటల్ ఓసియన్, గూగుల్ క్లౌడ్ వంటివి ఉన్నాయి.
- రాష్ట్రంలో విద్యా సంస్థల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసే వాతావరాణాన్ని కల్పించడంలో కీలకంగా పనిచేసింది. ఇందుకోసం ట్రీ ట్రైబ్ ను ఏర్పాటు చేసింది. సుమారు 24 కాలేజీల్లో 800లకు పైగా విద్యార్థులు పాల్గొనగా, అందు లో 10 ఆలోచనలకు స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎంపికయ్యాయి.
- టీ హబ్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా జాతీయ స్థాయిలో 300 స్టార్టప్‌లకు, అంతర్జాతీయ స్థాయిలో 200 స్టార్టప్‌లకు సహకారాలను అందాయి.
- అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలు చేసుకొని స్టార్టప్‌లకు అండగా టీ హబ్ నిలిచింది. వీటిలో ముఖ్యంగా కొరియా ఎస్ఎంఈ, పాల్కన్ ఎక్స్, ఆస్ట్రేలియన్ కాన్సులేట్, జపాన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా),లా ట్రోబ్ యూనివర్సిటీ వంటి విదేశాలకు చెందిన సంస్థలు టీ హబ్‌కు పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. ఇండియన్ స్టార్టప్‌లను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లడంలో విదేశీ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
కాటలిస్ట్ భవన్‌గా పేరు..
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్ త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో సుమారు 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ భవనాన్ని నిర్మించారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణం కోసం సుమారు. రూ.10 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. 1 జీబీ వేగంతో ఇంటర్నెట్, ఆన్లిమిటెడ్ వైఫై సదుపాయంతో జీ ప్లస్ 5 అంతస్తులో టీ హబ్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి కాటలిస్ట్ పేరును ఖరారు చేసి, గ్రీన్ బిల్డింగ్‌గా, ఎనర్జీ ఎఫిషియెంట్‌గా మలిచారు. స్టార్టప్‌లకు అండగా నిలిచేందుకు అత్యున్నత సంస్థలను భాగస్వామ్యం చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- t hub hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

