మొయినాబాద్, జూలై 9 : అర్ధరాత్రి సమయంలో డీజేల హోరు.. యువతులు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీని భగ్నం చేశారు. ఆరుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని సురంగల్ గ్రామ సమీపంలోని అజీబ్నగర్ రెవెన్యూలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మొయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతా నికి చెందిన రెహన్సిద్ధ్ద చౌహాన్ ఆటోడ్రైవర్. అతడి భార్య ఆర్కెస్ట్రా సింగర్‌గా పని చేస్తున్నది. కాగా, రోహన్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి ముజ్రా పార్టీ నిర్వహించేందుకు సురంగల్ సమీపంలోని అజీబ్నగర్ రెవెన్యూలో ఉన్న ఆర్ఎస్ ఫామ్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నాడు.
ఆర్కెస్ట్రా డ్యాన్సర్లుగా పనిచేసే ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు యువతులను తీసుకుని సోమవారం రాత్రి ఆ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో డీజేల సౌండ్ అధికంగా పెట్టి అర్ధనగ్నంగా.. అసభ్యంగా నృత్యాలు చేస్తుండగా.. రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో ఆ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి.. నలుగురు యువతులు, ఆరుగురు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రెండు కార్లు , మ్యూజిక్ సిస్టం, సెల్ఫోన్లు, రూ.12,160 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. తీసుకోలేదని తేలింది. కేసు నమోదు చేసిన వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.