ఎర్రగడ్డ, డిసెంబర్ 14: బోరబండ బస్ టెర్మినల్ సమీపంలోని ఓ మద్యం దుకాణానికి ఎదురుగా శనివారం ఉదయం ఫుట్పాత్ మెట్లపై ఓ వ్యక్తి మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు. స్థానికుల సమాచారం మేరకు సనత్నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని సదరు మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా, చనిపోయిన ఆ వ్యక్తి పేరు రాజు(33) అని, అతడు సారధీనగర్ సమీపంలోని గుడిసెల సముదాయంలో ఉండేవాడని స్థానికులు తెలిపారు.