Supreme Court | హెచ్‌సీయూ విధ్వంసంపై నేడు సుప్రీంకోర్టు విచారణ
హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
- నివేదిక ఇవ్వనున్న సర్కార్
- చెట్లు నరికేసిన ప్రాంతాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలంటూ ఇటీవల ప్రశ్నించిన కోర్టు
సిటీబ్యూరో, మే 14 ( నమస్తే తెలంగాణ ) : హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే 15 వరకు పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు సుప్రీం కోర్టు విచారణ జరపనునున్నది. హెచ్‌సీయూలో విధ్వంసానికి సంబంధించిన వివరాలన్నింటిని పరిశీలించడానికి ఏప్రిల్ 10న సెంట్రల్ ఎంవపర్డ్ కమిటీ హెచ్‌సీయూ విధ్వంసాన్ని పరిశీలించింది.
అక్కడి విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకుల ఒపీనియన్స్ సైతం సేకరించింది. కాగా, అక్కడ జరిగింది విధ్వంసమే.. చెట్లు, జంతువులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నివేదికను ఏప్రిల్ 15న కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. అదే రోజు ప్రభుత్వం కూడా నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఇదే సమయంలో మే 15 వరకు మీరు హెచ్‌సీయూ అడవుల్లో కూల్చిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది.
తెలంగాణ ప్రభుత్వం సరైన నివేదిక ఇవ్వాలని.. అలా ఇవ్వకపోతే సీఎస్‌ను జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించింది. చెట్లను నాటడానికి ఏ విధమైన పద్ధతులను అనుసరిస్తారో చెప్పాలంటూ సూచించింది. ఈ విషయంలో ప్రభుత్వం, సీఎస్‌ను ఎవరినీ కూడా ఉపేక్షించబోమని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు నివేదిక ఇవ్వనున్నది. ఈ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు విచారణ చేయనున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

