హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై ప్రతి ఆదివారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న‘సండే-ఫన్ డే’ కార్యక్రమం ఈ ఆదివారం ఆద్యంతం సందడిగా సాగనుంది. గణేశ్ నిమజ్జన ప్రక్రియ కారణంగా గత ఆదివారం సండే – ఫన్ డే కార్యక్రమం వాయిదా పడింది. ఈ వారం సండే – ఫన్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అర్బన్ డెవలప్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
టీఎస్ పోలీస్ బ్యాండ్, ఆర్కేస్ట్రా – తెలుగు పాటలు, ఒగ్గు డోలు, గుస్సాడీ, బోనాలు కోలాటం వంటి ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తినుబండారాలు అందుబాటులో ఉంచనున్నారు. హ్యాండ్లూమ్ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మంత్రి కేటీఆర్ సూచనతో ప్రారంభమైన ఈ సండే ఫన్ డే కార్యక్రమం.. అద్భుతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వాహనాలను అనుమతించడం లేదు.
#TankBund
— Arvind Kumar (@arvindkumar_ias) September 23, 2021
Sunday-Funday is back on sept 26th from 5-10 pm
Attractions :
1. TS Police Band
2. Orchestra – Telugu songs
3. Oggu Dolu, Gussadi & Bonalu Kolatam
4. Fireworks
5. Eateries
6. Handlooms & handicraft
7. Free saplings by @HMDA_Gov
& many more
@KTRTRSghmc pic.twitter.com/ikGfZ9EbsE