సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ): గ్రేటర్‌వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జూలైలో విస్తారంగా వర్షాలు కురవగా, వాతావరణం చల్లబడింది. కొద్దిరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్లే ఉక్కపోత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు. ఉత్తర కర్ణాటక నుంచి తమిళనాడు, మరఠ్వాడ మీదుగా కొనసాగుతున్న ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశముందని ఆమె వెల్లడించారు.