హైదరాబాద్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ(సెన్సార్) బోర్డు మెంబర్‌గా హైదరాబాద్‌కు చెందిన అక్కల సుధాకర్(Sudhakar) నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను బుధవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఫిలిం చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, హైదరాబాదీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రముఖ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా తదితరులు ఘనంగా సన్మానించారు. తనకు అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని సుధాకర్ పేర్కొన్నారు.