బంజారాహిల్స్,ఆగస్టు 11: మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లగ్జరీ అపార్ట్మెంట్స్ అందించాలనే లక్ష్యంతో సుచిరిండియా సంస్థ సరికొత్త వెంచర్‌ను శంషాబాద్ సమీపంలోని సాతంరాయి సమీపంలో ‘ది టేల్స్ ఆఫ్ గ్రీక్’ పేరుతో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బంజారాహిల్స్‌లోని తాజ్ దక్కన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుచిరిండియా సంస్థ చైర్మన్ డా.కిరణ్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించారు. రూ.175కోట్లతో ది టేల్స్ ఆఫ్ గ్రీక్ పేరుతో అపార్ట్మెంట్స్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నాని, దేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని ప్లాట్స్‌లో హోమ్ ఆటోమేషన్ విధానం, బిజినెస్ లాంజ్‌లను అందిస్తున్నామన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అపార్ట్‌మెంట్స్‌లో రూ.45లక్షల ప్రారంభ ధరనుంచి ప్లాట్లు అందిస్తామన్నారు. 24 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తిచేసి వినియోగదారులకు అందిస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సుమారు 2.65కోట్ల సబ్సిడీని పొందే అవకాశం ఉందన్నారు.