జవహర్‌నగర్,జనవరి7:పరిశోధనలే ప్రపం చ అభివృద్ధికి కొలమానం కావాలని, విద్యార్థు లు నూతన వంగడాలను సృష్టించాలని నానో సైన్స్ శాస్త్రవేత్త హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయం ఆర్. చంద్రశేఖర్ అన్నారు. శనివారం జవహర్‌నగర్ పరిధిలోని బిట్స్ క్యాంపస్‌లో నిర్వహించిన నేషనల్ సిపోసిమ్ అన్ కన్వర్జెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ, మెటీరియల్స్ (సీసీఎం-2023)పై జాతీయ సదస్సు రెండో రోజు తో ముగిసింది. ఈకార్యక్రమానికి దేశంలోని పలు రాష్ర్టాల విశ్వవిద్యాలయల నుంచి ప్రొఫెసర్లు, పరిశోధన విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ, జీవశాస్త్రం లో ఎన్నో ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులు కొత్త రకం జన్యువులను సృష్టించాలని సూచించారు. పరిశోధన విద్యార్థులు సరికొత్తగా ఆలోచనలు రూపుదిద్దుకునేలా ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. సైన్స్ మానవ జీవనానికి ఎంతో ఉపయోగపడుతున్నదని, తెలంగా ణ నుంచే ప్రపంచ దేశాలకు మెడిసిన్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని, మన శాస్త్రవేత్తలు ఆలోచన విధానం గొప్పదని ప్రసంసించారు.
అనంతరం పీహెచ్డీ విద్యార్థుల పోస్టర్ ఆవిష్కరణలకు మొదటి బహుమతి లీలశ్రీ బిట్స్ పిలానీ హైదారాబాద్ క్యాంపస్, రెండో బహుమతి ఇషితా నస్కర్ ఐఐటీ హైదరాబాద్, మూడో బహుమతి బిస్వాదీప ఐఐఎస్ఈఆర్ కోలకత్తాకు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సౌనక్రాయ్, ఎన్.రాజేశ్, సాబిట్ సబా, నీలాద్రి దాస్ ఐఐటీ పాట్నా, సతీష్పాటీల్ ఐఐఎస్సీ బెంగళూర్, పలు రాష్ర్టాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.