సిటీబ్యూరో, ఆగస్టు 16 ( నమస్తే తెలంగాణ ) : ఒకప్పుడు చదువుకు ఆర్థికభారం అడ్డొచ్చేది. ఉన్నత చదువులు చదవాలంటే దాతల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది విద్యార్థులు తమ చదువుకు ఆర్థిక కష్టాలు లేకుండా చూసుకుంటున్నారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు ఉద్యోగం చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోనే ఉండి లేదా పార్ట్ టైం లేదా సమయం దొరికినప్పుడల్లా చేసుకునే పలు పనులు అధికంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇంటర్నెట్ ఉంటే సరిపోతుందని సూచిస్తున్నారు. వెబ్సైట్లు, యాప్‌లు, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా తదితర వాటి ద్వారా ఆదాయం గడించవచ్చు. ఇప్పటికే నగరంలో చాలా మంది ఈ మార్గంలో డబ్బులు సంపాదించుకుంటున్నారు. అవేంటో మనమూ ఓ లుక్కేద్దాం..
సెల్లింగ్ ఇన్సూరెన్స్-పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్). 18 ఏండ్లు ఉంటే చాలు. పదో తరగతి పాసై ఉండాలి. ఎవరైన ఐప్లె చేసుకోవచ్చు. పార్ట్‌టైం ఉంటుంది. ఇన్సూరెన్స్ అమ్ముకుంటే చాలు డబ్బులు వస్తాయి. దీనికోసం గూగుల్ ఓపెన్ చేసి ఇన్సూరెన్స్ పీఓఎస్పీ ఐప్లె అని సర్చ్ చేయండి. కంపెనీల లిస్టు వస్తుంది. అందులో ఏదో ఒక కంపెనీ క్లిక్ చేస్తే సరిపోతుంది. అనంతరం గెట్ ఐప్లె అని క్లిక్ చేసి వివరాలు ఇవ్వాలి. ఎన్ని పాలసీలు అమ్మితే అంత కమీషన్ వస్తుంది. ఈ మధ్య చాలా మంది హెల్త్, టర్మ్ , కారు, బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఎవరికైతే కావాలో వారితో మాట్లాడి మీ ఐడీ ద్వారా అమ్మితే చాలు. ఉదాహరణకు ప్రీమియం రూ.25000 అయితే మీకు వచ్చే కమీషన్ రూ.3,750, బైక్స్ ఇన్సూరెన్స్ అయితే ప్రీమియం రూ.15వేలు ఉంటే రూ.2250 ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25000 అయితే మీకు వచ్చే కమీషన్ రూ.3000, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.10వేలు అయితే మీకు వచ్చే కమీషన్ రూ.3వేలు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు. పెట్టుబడి సున్నా. 30 గంటలు వారే మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తారు. దాని ద్వారా ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకోవచ్చు.
నోబ్రోకర్.కామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని అద్దె వివరాలు, విక్రయ వివరాలు అందించాలి. ఉదాహరణకు మీ గల్లీలో టూ లెట్ బోర్డ్ ఉంది లేదా అమ్మకానికి ఇల్లు ఉంది. ఆ సమాచారాన్ని నో బ్రోకర్డాట్కామ్కు అందిస్తే డబ్బు ఇస్తారు. మనమిచ్చిన సమాచారం ఆధారంగా వారు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి వారి యాప్‌లో రిజిస్టర్ అయ్యేలా చూసుకుంటారు. అలా అయినప్పుడు కమీషన్ కింద రూ.500 పైగా వస్తుంది. గూగుల్‌లో నోబ్రోకర్బ్రాండ్ అంబాసిడర్ అని సెర్చ్ చేయాలి. తొలుత వచ్చిన లింకును క్లిక్ చేసి రిజిస్టర్ అయితే సరిపోతుంది. అంతేకాదు ఎవరైన ఇల్లు షిఫ్టింగ్, పేయింటింగ్ వర్క్స్ ఉంటే వీరికే సమాచారం అందిస్తే చాలు. ఇలా సమాచారం అందిస్తే 5 శాతం కమీషన్ వస్తుంది. ఉదాహరణకు 50వేలు అయితే 2500 కంపెనీ ఇస్తుంది. ఇలా ఎన్ని చేసుకుంటే అంత డబ్బు.
ఏదైనా కంపెనీ వారి కోసం యాప్ తయారు చేసుకుంటుంది. అయితే దానిని మార్కెట్లో విడుదల చేసే ముందు ఆ యాప్ టెస్టింగ్ కోసం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. పూర్తిగా పరిశీలించాక ఓకే అనుకున్నాక మార్కెట్లో విడుదల చేస్తారు. ఒక యాప్‌ను లేదా వెబ్‌సైట్‌ను టెస్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. అయితే దీనికి గూగుల్‌లో యూసర్ టెస్టింగ్ వెబ్సైట్లోకి వెళ్లి గెట్పేయిడ్టూటెస్ట్ అనే ఆప్షన్ నొక్కితే సరిపోతుంది. అలాగే యూజర్లిటిక్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. 5వేల నుంచి 7వేల వరకు సంపాదించుకోవచ్చు.
సాయంత్రం ట్యూషన్స్ చెప్పుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక విద్యార్థి వద్ద రూ.3వేలు వసూలు చేసినా పది మందికి నెలకు ముప్పై వేలు సంపాదించే అవకాశం ఉంది. ట్యూటర్లుగా ఇంటికి వెళ్లి బోధిస్తున్నారు. అలా వెళ్తే కొంత డబ్బులు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ రంగంలో విద్యార్థినులు, గృహిణులు కూడా ఉన్నారు.
ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలి. కాలేజీల వివరాలు, ఫెస్ట్ విశేషాలు, ఇతర రాష్ట్రాల ప్రాధాన్యత ఇలా ఎన్నో కొత్త విషయాలు షూట్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కంటెంట్ క్లిక్ అయితే స్పాన్సర్ యాడ్ల ద్వారా డబ్బు వస్తుంటుంది.
మీకు తెలిసిన వారి వ్యాపారాలను ప్రమోట్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఇంట్లో ఎవరైన వంట బాగా చేస్తే దాని స్పెషాలిటీలతో క్లౌడ్ కిచెన్లతో ఒప్పందం చేసుకుని ఆ వంటలను ఫుడ్ లవర్స్‌కు విక్రయించవచ్చు. ఏదైనా హ్యాండ్ మేకింగ్ ఉత్పత్తులు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది.
నాకు ఇన్‌స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. దాని ఆధారంగా కొన్ని కంపెనీలు వారి వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి సంప్రదిస్తుంటాయి. అందుకు నేను ఛార్జీ చేస్తాను. హోటల్స్, షాపింగ్ మాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, స్నాక్స్ ఇలా చాలా వాటిని ప్రమోట్ చేస్తున్నా. గూగుల్ సెర్చ్ చేయడంపై అవగాహన ఉంటే చాలు డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి.
– రవళి, బీటెక్ ఫైనల్ ఇయర్
నేను టెస్టింగ్ యాప్స్, వెబ్‌సైట్స్‌పై ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నా. అందుకోసం నాకు వారు నేను ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను బట్టి డబ్బులు చెల్లిస్తారు. ఇప్పుడు డబ్బులు సంపాదించడం అనేది మనకున్న అవేర్నెస్పై ఆధారపడి ఉంది. అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి.
– తిరుపతి, బీకాం కంప్యూటర్స్, ఫైనల్ ఇయర్
చాలా మందికి కెమెరా ఉంటుం ది. కానీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో డీపీలు పెట్టుకోవడంపైనే దృష్టి సారిస్తారు. కానీ మనం తీసే ఫొటోల ద్వారా కూడా ఆదా యం గడించొచ్చని చాలా మందికి తెలియదు. అయితే మనం తీసిన మంచి ఫొటోల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అం దుకోసం షాపిఫైడాట్కామ్, గెట్టిఇమేజెస్డాట్ఇన్, 500పీఎక్స్, కెన్స్టాక్ఫొటో తదితర వెబ్సైట్లు ఉన్నా యి. ఉదాహరణకు గెట్టిఇమేజెస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో మీరు తీసిన ఫొటోలు అప్లోడ్ చేయాలి. వీడియో కూడా చేయొచ్చు. వాళ్లు దానిని రివ్యూ చేస్తారు. స్టాండర్డ్స్ బాగా ఉంటే వారు మీకు కమీషన్ అందిస్తారు.