ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 29: తెలంగాణ అభివృద్ధి ప్రదాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వీ(BRSV) ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేసీఆర్ కప్ 2025(KCR Cup 2025 )బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్‌హౌజ్‌లో విద్యార్థి నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రికెట్ టోర్నమెంట్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టోర్నమెంట్ నిర్వాహకుడు కొంపెల్లి నరేశ్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించిన విధంగానే ఈ ఏడాది సైతం కేసీఆర్ జన్మదినమైన ఫిబ్రవరి 17న కేసీఆర్ కప్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30,000 నగదు బహుమతితో పాటు ట్రోఫీ, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.10,000 నగదు బహుమతి అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కోతి విజయ్, నవీన్‌గౌడ్, మంతెన మధు, పవన్‌కుమార్, అర్జున్, రాజేశ్, సందీప్, భరత్, సురేశ్, మల్లేశ్, పృథ్వీ, బస్వరాజ్, యశ్వంత్, దామోదర్, ప్రభాకర్, మహేశ్, సురేందర్, ప్రశౠంత్, కమలాకర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.