సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): జలమండలి అధికారిక లోగోను ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. ఇటీవల కొందరు ప్రైవేట్ బోర్వెల్ ట్యాకర్ల ఆపరేటర్లు లోగో, బ్రాండ్‌ను వినియోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
జలమండలి లోగోను వినియోగిస్తే అది ప్రభుత్వ సేవలుగా భావించే పరిస్థితి ఏర్పడుతున్నదని, ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా మోసపూరిత చర్యగా గుర్తిస్తామన్నారు. ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా భావించి లోగో దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.