వనస్థలిపురం, జూలై 8 : ‘అంధకారంతో ఆగమాగం’ శీర్షికన శనివారం నమస్తే తెలంగాణ పత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. కాగా ఆ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని వైదేహినగర్, విజయపురి కాలనీ ప్రధాన రహదారిలో వీధి లైట్లను ఏర్పాటు చేశారు. అంతకు ముందు నాలుగు రోజులుగా లైట్లు వెలగక రాత్రి పూట ప్రయాణికులు, కాలనీ వాసులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం అన్ని లైట్లు వెలుగుతుండడంతో స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ వీధి లైట్ల నిర్వహణా వ్యవస్థను మెరుగు పర్చాలని సూచిస్తున్నారు. నమస్తే తెలంగాణ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.