Street Dogs | హైదరాబాద్లో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై 10 వీధి కుక్కలు దాడిచేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన ఆద్విక్ అనే బాలుడు వేసవి సెలవులు కావడంతో హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. సోమవారం నాడు ఇంటి సెల్లార్ పరిధిలో ఆడుకుంటుండగా 10 వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై విరుచుకుపడ్డాయి. చిన్నారి ఆరుపులు విన్న స్థానికులు వాటిని తరిమికొట్టారు. కానీ అప్పటికే కుక్కలు బాలుడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. వీధికుక్కల దాడిలో బాలుడి తలపై చర్మం ఊడిపోయి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలుడిని వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై టీచర్స్ కాలనీలోని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కలతో తరచూ ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్లో దారుణం
బాలూడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు
వేసవి సెలవుల కోసం సిద్ధిపేట నుండి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీకి వచ్చిన ఆద్విక్ అనే బాలుడు
ఇంటి బయట ఆడుకుంటుండగా బాలుడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు
వీధి కుక్కల దాడిలో తలపై చర్మం ఊడిపోయి తీవ్ర… pic.twitter.com/zMAuEYtJ0s
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026