Suriya | సూర్య మూవీ ఈవెంట్లో విజయ్ ప్రస్తావన.. ఆర్జే బాలాజీ కామెంట్స్‌పై ఫ్యాన్స్ వెరైటీ రియాక్షన్!
Suriya | సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Suriya | సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన ఆర్జే బాలాజీ ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ గురించి ప్రస్తావించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. “రెండేళ్ల క్రితం విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది ఆయనను నమ్మలేదు. నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఆయనకు ఆయన మీద నమ్మకం ఉంది. తన ఆలోచనలు, లక్ష్యాలపై విశ్వాసంతో ముందుకు వెళ్లారు. అదే నమ్మకం ప్రజల్లోనూ కలిగి, ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా నిలిచారు” అని అన్నారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్ పేరును కూడా ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. మనల్ని మనం నమ్ముకుంటే అది ఎంతటి శక్తిగా మారుతుందో విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరూ నిరూపించారు. నేను కూడా ఆర్జేగా మొదలై నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగాను” అంటూ చెప్పుకొచ్చారు. అయితే సూర్య సినిమా ఈవెంట్లో మరో హీరో గురించి, ముఖ్యంగా విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ఎలివేట్ చేయడంపై కొంతమంది సూర్య అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఈవెంట్లలో రాజకీయాల ప్రస్తావన అవసరమా?”, సూర్య ఈవెంట్లో విజయ్ గురించి ఎందుకు మాట్లాడాలి?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
అయితే మరోవైపు హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అభిమానులకు గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఆర్జే బాలాజీ విజయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు సూర్య స్వయంగా చప్పట్లు కొట్టి అభినందించారు. అలాగే విజయ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూర్య సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన విషయం కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

