Street Cause | హైదరాబాద్‌లోని విద్యార్థులతో నిర్వహించబడే అతిపెద్ద ఎన్జీవో స్ట్రీట్ కాజ్ అని సంస్థ ప్రతినిధి క్షిరజా తెలిపారు. 2009లో స్ట్రీజ్ కాజ్ ప్రారంభించినప్పటి నుంచి రూ.5.5 కోట్లకుపైగా ఖర్చుతో 15,000 కంటే ఎక్కువ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశామని.. 30 లక్షలకుపైగా వ్యక్తులు, 273కుపైగా జంతువులపై సానుకూల ప్రభావం చూపిందన్నారు.
తాము ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా 30 కంటే ఎక్కువ కళాశాల్లో 4 వేల కంటే ఎక్కువ మంది విద్యా వాలంటీర్ల బృందం, 45వేలకుపైగా సభ్యుల పూర్వ విద్యార్థుల మద్దతుతో దేశవ్యాప్తంగా ఏడు నగరాలైన బెంగళూరు, చెన్నై, కొచ్చి, ఢిల్లీ, ముంబై, పూణే, విశాఖపట్నంకు విస్తరించి.. స్ట్రీట్ కాజ్‌ను జాతీయ స్థాయి ఎన్జీవోగా మార్చామని పేర్కొన్నారు. స్ట్రీట్ కాజ్ ఎన్జీవో ముఖ్య కార్యక్రమం స్ట్రీట్ ఫర్ ఏ కాజ్ ఇపుడు 12వ ఎడిషన్‌లోకి (RFC 12) ఎంట్రీ ఇస్తోందన్నారు..
మార్చి 1న రన్ ఫర్ ఏ కాజ్..
12వ ఎడిషన్‌లో భాగంగా మార్చి 1న రన్ ఫర్ ఏ కాజ్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ట్యాంక్‌బండ్ వద్ద గల పీపుల్స్ ప్లాజా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి 10వేలకుపైగా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఈవెంట్లో ఫ్లాష్ మాబ్, మారథాన్ రన్, బ్యాండ్ పర్ఫార్మెన్స్ (90 నిమిషాలు) బ్రేక్ ఫాస్ట్ మేళా వంటి కార్యక్రమాలుండనున్నాయి. రన్ ఫర్ ఎ కాజ్ మార్చి 1న ఉదయం 6 -7 గంటల మధ్య మొదలై రాత్రి 11 -11:30 గంటలకు ముగుస్తుందని తెలిపారు.
గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్దాశ్రమాలు, సమాజంలోని ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా బాసటగా నిలుస్తూ.. వారిపై శాశ్వత ప్రభావాన్ని చూపే స్థిరమైన, దీర్ఘ కాలిక ప్రాజెక్టులపై దృష్టి పెడతామన్నారు. మెరుగైన రేపటి కోసం యువతకు అవగాహన కల్పిస్తూ.. వారిలో సాధికారత కల్పించేందుకు తాము కృషి చేస్తామన్నారు. మా సేవలకు మద్దతుగా ఏడాది పొడవునా నిధుల సేకరణ కోసం రన్ ఫర్ ఏ కాజ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
