కోర్టు ఆదేశాలను అమలు చేయలేదెందుకు?
మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం భౌరంపేటలో సర్వే నం 166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీ లించి అనుబంధ సేత్వారీ జారీ చేయాలని ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రాజకీయ నేతల ఫిర్యాదు ఆధారంగా గత ఉత్తర్వులను కలెక్టర్ తిరిగి పకన పెట్టడాన్ని తప్పు పట్టింది.
- కలెక్టర్‌ను ప్రశ్నించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తేతెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం భౌరంపేటలో సర్వే నం 166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీ లించి అనుబంధ సేత్వారీ జారీ చేయాలని ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రాజకీయ నేతల ఫిర్యాదు ఆధారంగా గత ఉత్తర్వులను కలెక్టర్ తిరిగి పకన పెట్టడాన్ని తప్పు పట్టింది. ప్రైవేటు వ్యక్తి స్థలానికి తాళం వెయ్యడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాళాన్ని వెంటనే తొలగించాలని తహసీల్దార్, కలెక్టర్లను ఆదేశించింది. మాజీ సైనికుల కోటా కింద కేటాయించిన 4.38 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన సర్వే అధికారుల రికార్డులన్నింటినీ పరిశీలించిన కలెక్టర్ సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేయాలంటూ 17న ఇచ్చిన ఉత్తర్వులను పకన పెట్టారు.
ఏప్రిల్ 13న ఇచ్చిన కలెక్టర్ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ జీవేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారించారు. మాజీ సైనికుడి నుంచి కొనుగోలు చేసిన భూమికి సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేసి, రికార్డులను సవరించాలని ఆదేశాలు జారీ చేశారని న్యాయవాది చెప్పారు. ఆధారాలు లేకుండా స్థానిక రాజకీయ నాయకులు ఆకుల సతీశ్ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పకన పెట్టారన్నారు. దీనిపై హైకోర్టు.. ఏప్రిల్ 13నాటి కలెక్టర్ ఉత్తర్వుల అమలును నిలిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ స్థలానికి ఉన్న తాళాన్ని తొలగించాలని ఆదేశించింది. విచారణను వచ్చేనెలకు వాయిదా వేసింది.
అక్రమ నిర్మాణాలపై నామమాత్రపు చర్యలు..
అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ చర్యలు నామమాత్రంగా ఉంటున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సం బంధించి జీహెచ్ఎంసీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తప్పు పట్టింది. ఫిర్యాదుల్లో అక్రమ నిర్మాణ దారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి ఊరుకుంటుందని తప్పు పట్టింది. కొన్ని కేసుల్లో మాత్రమే ఉత్తర్వులు జారీ చేస్తోందని పేరొంది. అక్రమ నిర్మాణాల ఫిర్యాదుల గురించి వెబ్సైట్లో పొందుపరచాలని చెప్పింది. ఇలా చేస్తే అక్రమ నిర్మాణాల గురించి ప్రజలకు తెలుస్తుందని అభిప్రాయబడింది.
హైకోర్టు, సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడానికి జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీసుల సహాయం తీసుకోవచ్చునని చెప్పింది. హైదరాబాద్ కోఠి ప్రాంతంలో జ్ఞానశేఖర్ అనే వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ముకుందాస్ సోని మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్ ఇటీవల విచారించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ దీనిపై పై విధంగా వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాల ప్రాంతాన్ని అధికారులు సందర్శించారని, అక్రమ నిర్మాణాలకు సీలు వేసినట్టుగా గత నెల 26న పిటిషనర్లకు సమాచారం ఇవ్వడం మినహా ఏ విధమైన చర్యలు లేవని తప్పు పట్టారు. విచారణను ఈనెల 27కు వాయిదా వేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

