Sri Ramanavami | సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ): ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణ తలంబ్రాలు కావాలనుకునే భక్తులకు నేరుగా వారి ఇంటికే చేర్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 6 వరకు కూడా తలంబ్రాలు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాలతో పాటు సంస్థ వెబ్సైట్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆన్లైన్ బుకింగ్తో పాటు కాల్ సెంటర్లు 040-69440069, 040-69440000 ను సంప్రదించి సేవలు పొందొచ్చని వివరించారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.