నేరేడ్మెట్, ఫిబ్రవరి 2: ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొలువైన శ్రీవారికి శనివారం సుమారు 76 కిలోల చింతకాయలతో ప్రత్యేకంగా అలంకరించారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు, తులసి వెంకట రమణాచార్యులు తెలిపారు.