బంజారాహిల్స్,జూన్ 21: తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని అన్ని ప్రముఖ ఆలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరించారు. శ్రీనగర్ కాలనీలోని ్ర శీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమస్యలు తీర్చారని సంతోషం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్‌లో..
ఫిలింనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వందలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్ తదితరులు బోనమెత్తారు. డప్పుల దరువుతో ఫిలింనగర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి ఈ కార్యక్రమంలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ డెవపల్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కే.విప్లవ్‌కుమార్, బీఆర్ఎస్ నేతలు మామిడి నర్సింగరావు, పద్మ. దీపాదేవి, రాములు చౌహాన్, ధనమ్మ, యండూరి మాధవి తదితరులు పాల్గొన్నారు.