Hyderabad | మన్సురాబాద్, జూన్ 27 : ఆషాఢ మాసంను పురస్కరించుకొని మన్సురాబాద్ శ్రీ సాయి నగర్ కాలనీలోని శ్రీ దుర్గాదేవి దేవాలయంలో అమ్మవారిని నింబశాఖ మాలలతో (వేప ఆకు మాలలతో) అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆషాఢమాసం సందర్భంగా నెల రోజులపాటు ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోచబోయిన గణేష్ యాదవ్ తెలిపారు.
జూలై 4న అమ్మవారిని శాకాంబరి దేవి రూపంలో, 11వ తేదీన జంజర ఫల మూలరూపంలో, 18వ తేదీన పుష్పాలంకరణ నిర్వహించబడుతుందని తెలిపారు. అదేవిధంగా జులై 6న తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తికి పంచామృత, ఫల రసాభిషేకాలు నిర్వహించబడతాయని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆషాఢమాస పూజల్లో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదగిరి, హనుమంతరావు, రమేష్, రవి, మురళి, అశోక్, రమణమూర్తి, అజయ్, లక్ష్మయ్య, కేశవులు, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.