సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు తమ పరిధిలో రెండు రోజుల పాటు చేపట్టిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో 460 మందిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో 12,13 తేదీల్లో చేపట్టిన డ్రైవ్లో మొత్తం 460 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇందులో 350 మంది ద్విచక్రవాహనదారులు , 25 మంది త్రీవీలర్స్, 85 మంది ఫోర్వీలర్స్ డ్రైవర్స్ ఉన్నారని వారు పేర్కొన్నారు. వీరందరిని చట్టపరంగా కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.