బడంగ్‌పేట, నవంబర్ 16 : ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్‌ను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాంచ్‌లో(ఎస్బీ)గా పనిచేస్తున్నాడు. కాగా వెంకటేశ్వర్రావు సైదాబాద్‌లో నివాసముంటున్న ఓ వివాహితను వేధించడంతో 2021 జనవరి 25న సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో సదరు వివాహిత ఈసీఐఎల్‌కు వెళ్లిపోవడంతో పాటు ఫోన్ నంబర్ మార్చేసింది. అయితే జైలు నుంచి వచ్చిన వెంకటేశ్వర్రావు సదరు వివాహిత ఫోన్ నంబర్ తెలుసుకొని వేధించసాగాడు. 2022 ఆగస్టు 15న వివాహిత ఇంటికి వచ్చి లైంగికదాడికి పాల్పడటంతో పాటు ప్రతిరోజు వేధిస్తున్నాడని ఈనెల 14న మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వర్రావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.