563 కేసులు.. రూ 22.17 కోట్ల విలువైన డ్రగ్స్
హైదరాబాద్‌లో నిషేధిత డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే లక్ష్యంగా నగర పోలీసులు బహుముఖ వ్యూహంతో ముం దుకు సాగుతున్నారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 563 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి.
- ఏడాదిగా డ్రగ్స్ మహమ్మారిపై సిటీ పోలీసుల సమరం
- డ్రగ్స్ రహిత హైదరాబాద్ ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణ
సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో నిషేధిత డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపడమే లక్ష్యంగా నగర పోలీసులు బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. జూన్ 2025 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 563 ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ దాడుల ద్వారా ఏకంగా రూ.22.17కోట్ల విలువైన నిషేధిత మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకుని ఆయా ముఠాల గుట్టు రట్టు చేశారు. గత ఏడాది కాలంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, నగరంలో అత్యధికంగా జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో 116 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్ జోన్ పరిధిలో 99 కేసులు, గోల్కొండ జోన్ పరిధిలో 95, చార్మినార్ జోన్లో 90 కేసులు నమోదయ్యాయి.
రాజేంద్రనగర్ జోన్లో 84కేసులు, ఖైరతాబాద్‌లో 49, శంషాబాద్ జోన్లో 30కేసుల చొప్పున నమోదయ్యా యి. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు సీజ్ చేసిన డ్రగ్స్‌లో అత్యధిక భాగం గంజాయిదేనంటూ పోలీసులు చెప్పారు. రూ.12. 56కోట్ల విలువైన 2,513 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా రూ. 6.91కోట్ల విలువ కలిగిన 55.3లీటర్ల హ్యాష్ఆయిల్ను జప్తు చేశా రు. మాదకద్రవ్యాల సరఫరానే కాకుండా స్థానికంగా విక్రయాలు జరిపే స్థావరాలపైన పోలీసులు దృష్టిపెట్టారు. మంగార్బస్తీలో 1100 మంది పోలీసులతో ఆపరేషన్ థండర్‌బోల్ట్ పేరిట భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున గంజా యి, అక్రమ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు నగరంలో మొ త్తం 1550 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 421మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిని కేవలం శిక్షలకే పరిమి తం చేయకుండా గాంధీ ఆసుపత్రి, ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య సంస్థతో పాటు ప్రముఖ ప్రైవేటు పునరావాస కేంద్రాలకు తరలించి ప్రత్యేక చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. నగరంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టే విషయంలో పోలీసుశాఖ చాలా సీరియస్‌గా పనిచేస్తున్నదని, నేరాల అదుపుతో సామాజిక బాధ్యతను జోడించి పోలీఈ ప్రయాణం సానుకూల మార్పు కు దారితీస్తుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

