మియాపూర్, నవంబర్ 2: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్ఛంద సంస్థలు సైతం ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సినాప్సిస్ సాఫ్ట్వేర్ సంస్థ సౌజన్యంతో నిర్మాణ్.ఓఆర్జీ సంస్థ రూ.6 లక్షలు విలువజేసే 50 డిజిటల్ ట్యాబ్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఈ పరికరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. విలువైన డిజిటల్ పరికరాలను అందించిన సినాప్సిస్ సంస్థను అభినందించారు. దాతల చేయూతను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని.. మంచి ఫలితాలతో ఉన్నతిని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సినాప్సిస్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర, నర్సింహ, అనూరాధ, భార్గవ్ రామ్, భగవాన్, ఎంఈవో వెంకటయ్య, ప్రధానోపాధ్యాయురాలు వసుంధర, బాల్రెడ్డి, శేఖర్, మంజుల, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం, మోహన్, ఎండీ అన్వర్ షరీఫ్, గంగాధర్, గోపాల్, కిరణ్, మహేందర్, శ్రీనివాస్, ఖాజా, జహంగీర్, అశోక్, చంద్రిక పాల్గొన్నారు.