శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 : నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని అమరరాజ కార్పొరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన “అమర హాస్పిటల్ స్లీపవుట్ రీచ్ సెంటర్”ను గురువారం ప్రముఖ చలన చిత్ర దర్శకులు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ సినీనటుడు, నిర్మాత మురళీమోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ రమాదేవి గౌరినేని మాట్లాడుతూ ఐటీ సంస్థలు అధికంగా ఉన్న ఐటీ కారిడార్ లాంటి ప్రాంతాల్లో అధికశాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిద్రలేమి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారికి తమ హాస్పిటల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా మారుతున్న కాలానుగుణంగా జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడితో నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.