ప్లాట్ నకిలీ డాక్యుమెంట్ కేసులో ఆరుగురికి రిమాండ్
ఓ ప్లాట్‌కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో ఆరుగురిపై కేసు నమోదైన ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్‌స్టేషన్ పరిధి రాంపల్లిలోని సర్వేనెంబర్ 404, 405లోని ప్లాట్ నెం.108లోని 300 గజాల ప్లాట్‌ను నిజాంపేట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర 1983లో కొనుగోలు చేశాడు.
కీసర, మే 3: ఓ ప్లాట్‌కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించిన కేసులో ఆరుగురిపై కేసు నమోదైన ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్‌స్టేషన్ పరిధి రాంపల్లిలోని సర్వేనెంబర్ 404, 405లోని ప్లాట్ నెం.108లోని 300 గజాల ప్లాట్‌ను నిజాంపేట్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి రవీంద్ర 1983లో కొనుగోలు చేశాడు. ఈ ప్లాట్‌ను సొంతం చేసుకోవడానికి నిందితులు అసలు యజమాని లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంట్ నెంబర్ సృష్టించి డాక్యుమెంట్ రైటర్ ఉదయ్‌రెడ్డి, అప్పటి సబ్ రిజిస్ట్రార్ రెహమాన్‌తో కుమ్మకై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు అమ్మిన్నట్లు బయటపడింది.
ఈ క్రమంలో ఆ ప్లాట్‌కు నకిలీ ఓనర్‌గా ఉన్న ధర్మారావును సృష్టించి అతను ప్రదీప్‌కుమార్‌కు, ప్రదీప్‌కుమార్ ఆ ప్లాట్‌ను రెండుగా విభజించి ప్రభాకర్, నరేశ్ అనే వ్యక్తులకు తరువాత వారిద్దరు కలిసి గుబ్బల వెంకటేశ్వర్రావు, (జీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)కు రిజిస్ట్రేషన్ చేస్తూ చివరికి వారు కలిసి జంగాల శ్రీరామ్, అతని భార్య విజయలక్ష్మీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కేసులో నిందితులంతా ఒక గ్రూప్‌గా మారి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నకిలీ డాక్యుమెంట్ ద్వారా ప్లాట్స్‌ను కబ్జా చేసి అమాయకులకు అమ్మి మోసం చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు.
ఈ కేసులో నిందితులైన జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్రావు, బందెల్ల ప్రభాకర్, పోన్నబోయిన బాలకృష్ణ, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డిలను కీసర పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నకిలీ ప్లాట్ డాక్యుమెంట్ కేసులో సమగ్ర విచారణ జరిపిన జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు, ధర్యాప్తు అధికారి అనిల్‌కుమార్, కీసర పోలీసు సిబ్బందిని మల్కాజ్గిరి డిప్యూటీ కమిషనర్ సీఎచ్ శ్రీధర్ అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

