సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర కేంద్రంగా నగరంలో గంజాయి విక్రయాలు జరుపుతున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.4లక్షల విలువ చేసే రూ.6.47 కేజీల గంజాయిని స్వాధీనం చే సుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్‌రావు కథనం ప్రకారం…నగరానికి చెందిన విన్ని, భిక్షు, చంటి, క్రాంతి, నిఖిల్, సాయికిరణ్ లు కొంత కాలంగా మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకువచ్చి నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్ శివారు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న ఆబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు శుక్రవారం చందానగర్ ప్రాంతంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో మహారాష్ర్ట నుంచి రైల్లో తీసుకువచ్చిన గంజాయిని పంచుకుంటున్న ఆరుగురు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.4లక్షలు విలువ చేసే 93గంజాయి ప్యాకెట్లతో పాటు ఐదు సెల్ఫోన్లను స్వా ధీనం చేసుకున్నారు. ఈ కేసు చేధించిన వా రిలో ఎస్టీఎఫ్ సీఐ భిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, కానిస్టేబుల్ సంతోశ్, యాదగిరి, హనీఫ్, లక్ష్మణ్, సాయికిరణ్, శంకరులు ఉ న్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.