సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్‌కిరణ్ కథనం ప్రకారం..గ్రేటర్లో నాన్‌డ్యూటీపెయిడ్ లిక్కర్‌ను అరికట్టాలని ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిం జారీచేసిన ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి నుంచి నగర శివారు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు.
పహాడీషరీఫ్ క్రాస్ రోడ్డులో గోవా, హర్యానా, మేఘాలయ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాల్లో రూ.4.50లక్షల విలువ చేసే 88 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. అక్రమంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి మద్యం రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఎన్డీపీ లిక్కర్‌తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును సరూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.