పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన భారీ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సిగాచీ ఇండస్ట్రీస్ కంపెనీ సీఈవో అమిత్రాజ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేశారు. ఫ్యాక్టరీలో భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందని ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో శనివారం రాత్రి ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ యూనిట్లో ఈ ఏడాది జూన్ 30వ తేదీన భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.