Love Fraud | అతడు ఎస్ఐ.. ఆమె కానిస్టేబుల్.. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే ఆ ప్రేమ కాస్తా పెళ్లి దాకా వచ్చేసరికి ముఖం చాటేశాడు సదరు ఎస్ఐ. ఈ ఘటన కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. 2018 బ్యాచ్‌కు చెందిన ఎస్సీ సురేష్ కుమార్ కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని చేస్తున్నాడు. అతడికి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్‌తో పరిచయమైంది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుంటానని హమీ ఇవ్వడంతో సురేష్‌కు సదరు యువతి మరింత దగ్గరైంది.
కొన్నాళ్ల తర్వాత పెళ్లి విషయంపై యువతి ఎస్ఐ సురేష్ కుమార్‌ను ఒత్తిడి చేసింది. అయితే ఎస్ఐ సురేష్ కుమార్ ఏవో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ మధ్య పెళ్లి విషయంలో ఇద్దరిమధ్య గొడవ జరిగినట్లు సమాచారం.
ఫోన్లు స్విచ్ఛాఫ్..
ఎస్ఐ సురేష్ కుమార్ తనను మోసం చేయడానికి యత్నిస్తున్నట్లు అనుమానించిన మహిళా కానిస్టేబుల్ అతన్ని గట్టిగా నిలదీసింది.. దీంతో ఎస్ఐ సురేష్ కుమార్ ఆమెపై ఎదురుతిరిగి పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో అతనిపై బాధిత యువతి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను విచారించడానికి ప్రయత్నించారు. అయితే అతను ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో.. బాధిత యువతి ఇచ్చిన ఆధారాలతో అధికారులు అతన్నిసస్పెండ్ చేశారు.
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు