Shruti Haasan | నల్లగండ్లలో శృతి హాసన్ సందడి
శేరిలింగంపల్లి నల్లగండ్లలో సినీ నటి శృతి హాసన్(Shruti Haasan )సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం షాపింగ్ మాల్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు.
శేరిలింగంపల్లి, జూలై 3 : శేరిలింగంపల్లి నల్లగండ్లలో సినీ నటి శృతి హాసన్(Shruti Haasan )సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన శుభప్రదం షాపింగ్ మాల్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మాల్ పరిసరాలు సందడిగా మారాయి. మాల్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాడిన శృతి హాసన్ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయని, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
సంప్రదాయ దుస్తులతో పాటు పార్టీ వేర్ దుస్తులు కూడా తనకు నచ్చుతాయని, సందర్భాన్ని బట్టి వాటిని ధరిస్తానని పేర్కొన్నారు. శుభప్రదం షాపింగ్ మాల్లో అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన సంప్రదాయ, ఆధునిక దుస్తులు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాల్ యాజమాన్యం పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

