ఖైరతాబాద్, ఆగస్టు 7: వస్త్ర ప్రపంచంలో అగ్రభాగాన నిలిచిన మంగళగౌరి.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మరిన్ని ఆకర్షణీయమైన వస్త్ర శ్రేణులను తీసుకువస్తోంది. భారతదేశంలోనే తొలి సారిగా చేనేతకు చేయూతనిచ్చే కేజీ సేల్ ఆఫర్‌ను ప్రకటించింది. సంప్రదాయానికి మేళవింపుగా పచ్చని మగ్గాలతో రూపుదిద్దుకున్న కంచిపురం, చేనేత వృత్తిదారులు కళాత్మకంగా రూపొందించిన ధర్మవరం, ఉప్పాడ, పోచంపల్లి, బనారస్, ఆరణి, గద్వాల్, వెంకటగిరి, జైపూర్, కేరళ చీరలను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది.
అన్ని వస్ర్తాలపై 50 శాతం వరకు డిస్కౌంట్, ఒకటి కొంటే ఒకటి ఉచితం, ఎంపికైన కలెక్షన్‌పై ఒకటి కొంటే రెండు ఉచితం లాంటి ఆఫర్లను అందిస్తోంది. నేరుగా నేతన్నల నుంచి సేకరిస్తుండటంతో అందుబాటులో ధరల్లో లభిస్తున్నాయి. పురాతన సంప్రదాయాలు ప్రతిబింబించే ఆధునిక డిజైన్ల చీరలను ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సేల్ ద్వారా పాత కాలపు చేనేత అందాలను కొత్త తరానికి చేరవేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
పెళ్లిళ్లకు కావాల్సిన బ్రైడల్ సిల్క్స్ మొదలు రోజు వారీగా ధరించేందుకు వీలుగా తేలికపాటి చీరల వరకు అన్ని రకాల కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఆరు షోరూమ్‌లలో కొనసాగుతున్న ఈ సేల్కు మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, స్టాక్ ముగిసేంత వరకు మాత్రమే ఈ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.