మహేశ్వరం, జనవరి 30: ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుండా మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ.కోటితో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయించారు. ఈ ఆక్సిజన్ ప్లాంటు పనులను అన్నింటిని పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు. కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ లేక ప్రజలు పడిన బాధలను గమనించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి అమెజాన్ కంపెనీ సౌజన్యంతో కన్సాన్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహేశ్వరంలో ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయించారు.ఈ ప్లాంటులో ఒక నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని టెక్నికల్ ఇంజనీర్లు అంటున్నారు. ఇపుడు 20 బెడ్లు ఉన్న రోగులకు ఆక్సిజన్లను అందిస్తున్నామని టెక్నికల్ అధికారులు అంటున్నారు. విద్యుత్‌కు అంతరాయం కలిగినా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 200 కేవీ వోల్టేజీతో ఒక జనరేటర్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండల కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంటును నిర్మించిన మంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలకు భరోసా
కల్పించడానికే మహేశ్వరం మండల కేంద్రంలో రూ. కోటితో ఆక్సిజన్ప్లాంటును ఆమెజాన్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేశాం. గతంలో ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తిరిగి ఆ పరిస్థితులు పునరావృతం రాకుండా ఉండేందుకే మండల కేంద్రంలో ఆక్సిజన్ప్లాంటును ప్రారంభించాం. రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గం కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ప్లాంటు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాను.
రోగులకు మంచి అవకాశం
ఈ ఆక్సిజన్ ప్లాంటు పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ అందక గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేయడం సంతోషం. మహేశ్వరం మండల కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంటు రావడం ఇక్కడి ప్రజల అదృష్టం.ఈ అవకాశాన్ని ఈ ప్రాంతం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.