
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా అందిస్తున్న మాసీవ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులకు (మూక్స్) విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి యూనివర్సిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు యూనివర్సిటీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆన్లైన్ ద్వారా 12 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.
పలు కోర్సుల వివరాలు..
సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రాబబులిటీ మెథడ్స్, బేసిక్ కాన్స్ట్రక్చన్ మెటీరియల్స్, స్ట్రక్చరల్ డైనమిక్ కోర్సులు, అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం ఉన్నాయి. ఈఈఈలో ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నటిక్ వేవ్, ఈసీఈలో ది జాయ్ కంప్యూటింగ్ యూజింగ్ పైథాన్, సీఎస్ఈలో బ్లాక్‌చైన్ అప్లికేషన్స్, ఐటీలో బ్లాక్‌చైన్ అండ్ అప్లికేషన్, సెన్సార్స్ అండ్ అక్చువేటర్స్ తదితర కోర్సులు ఉన్నాయి.
బోధనకు ముందుకు వచ్చిన ఐఐటీలు..
మూక్స్, జేఎన్టీయూ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకువచ్చిన స్వల్పకాలిక కోర్సులు బోధించడానికి దేశ వ్యాప్తంగా పలు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎస్సీ వంటి జాతీయ విద్యా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు జేఎన్టీయూతో ఆయా విద్యా సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. వాటిలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ ముంబై, ట్రిపుల్ టీ హైదరాబాద్, ఐఐటీ రాపోర్, ఐఐటీ మద్రాసు, ఐఐటీ బెంగళూర్, ఐఐటీ రూర్కి, ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఉన్నాయి. ప్రతి రోజూ ఫ్యాకల్టీకి అనుగుణంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించే అవకాశం ఉందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం స్వయం పోర్టల్‌ను సంప్రదించాలని సూచించారు.
సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తాం
మూక్స్ ద్వారా పలు స్వల్పకాలిక కోర్సులు పూర్తిచేసుకోవచ్చు. వాటికి సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తాం. విద్యార్థులు మార్కెట్ అంచనాలతో తమకు కావాల్సిన కోర్సులు పూర్తి చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాం. అయితే ప్రస్తుతం బీటెక్ థర్డ్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్, బీటెక్ ఫోర్త్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించాం. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
స్వల్పకాలిక కోర్సులకు గ్రీన్ సిగ్నల్
యూనివర్సిటీ క్యాంపస్, అటానమస్, కానిస్టూయంట్, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరూ బీటెక్‌లో మూడు నెలల స్వల్పకాలిక కోర్సులు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఈ కోర్సులు ఎంతో దోహదపడుతాయి.