బంజారాహిల్స్, మే 6: జూబ్లీహిల్స్‌లో సంపన్న కుటుంబాలకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి సెక్స్ ట్రాప్ చేస్తున్న ముఠాలోని మరో ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కేసులో అరస్టైన వారి సంఖ్య 8కి చేరింది. ప్రధాన నిందితుడు అర్జున్‌తో పాటు మరికొంతమంది యువకులు డబ్బు న్న అమ్మాయిలను గుర్తించి పక్కా టార్గెట్ చేసి వారిని వలలో వేస్తున్నారని.. వారి వద్ద నుంచి పెద్ద మొ త్తంలో డబ్బులు గుంజుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో అరస్టైయిన కోడూరు చంద్రశేఖర్ అలియాస్ అర్జున్, అతడి సోదరుడు కోడూరు రాజీవ్, స్నేహితుడు ఉదిత్ కార్తీక్ ప్రస్తు తం జైల్లో ఉన్నారు.
కాగా అర్జున్ తల్లి మీనాకుమారి, మేనమామ టి.ప్రశాంత్, విజయవాడకు చెందిన మీ నాకుమారి స్నేహితుడు వినీల్ చౌదరి కనుసన్నల్లోనే నిందితులు సెక్స్ ట్రాప్ చేసి డబ్బులు గుంజారని పక్కా అధారాలు లభ్యం కావడంతో మంగళవారం వారిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా అర్జున్ ముఠాలోని వరంగల్ జిల్లా కేసముద్రం ప్రాంతానికి చెందిన హేమంత్, జగద్గిరిగుట్ట ప్రాంతం లో నివాసం ఉంటున్న జితేందర్ అలియాస్ జితిన్‌లు సైతం ఇదే తరహాలో పలువురు యువతులను లోబర్చుకుని వారివద్దనుంచి డబ్బులు గుంజారని తేలడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో సరస్వతి అనే మహిళ, నిషాంత్, శ్రీజిత్‌తో పాటు మరికొంతమంది పాత్రధారులున్నారని, వారిని పట్టుకుంటే మరిన్ని మోసాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికను సెక్స్ ట్రాప్ చేసి భారీగా డబ్బులు గుంజిన ఘటనలో అరస్టైన ప్రధాన నిందితులు అర్జున్, రాజీవ్లతోపాటు అతడి స్నేహితులను లోతుగా విచారించగా దిమ్మదిరిగే వాస్తవాలు బయటకొచ్చాయి. నిందితుల వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్ చాటింగ్స్, కాల్స్ పరిశీలించిన పోలీసులు విస్మయానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్గనైజ్డ్ పద్ధతిలో సంపన్న యువతులకు ఎర వేస్తున్నట్లు తేలడంతో ఏకంగా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఉమెన్ సేఫ్టీసెల్ డీసీపీ లావణ్యానాయక్ రంగంలోకి దిగారు. నిందితులను స్వయంగా విచారించగా అత్యంత ప్రమాదకరమైన సంస్కృతిని గుర్తించారు. గచ్చిబౌలిలోని ఓ డ్రైవ్ ఇన్ వద్ద తరచూ కలుసుకునే కొంతమంది యువకులు అక్కడికి వచ్చే యువతులతో స్నేహం చేయడం, వారిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం, వారితో తరచూ చాటింగ్ చేస్తూ లగ్జరీ లైఫ్‌ైస్టెల్ ఉన్నట్లు భ్రమింపజేసి లోబర్చుకున్నట్లు తేలింది.
సెక్స్ ట్రాప్ చేయడమే కాకుండా వారివద్దనుంచి లక్షల్లో డబ్బు వసూలు చేయడం, పార్టీలు, డ్రెస్‌లు, బహుమతుల పేరుతో భారీగా డబ్బు ఖర్చు చేయించేందుకు ముఠాగా ఏర్పడినట్లు తేలింది. అర్జున్, అతడి సోదరుడు రాజీవ్‌కు పలువురు యువతులతో పరిచయాలున్నాయని, వారిలో కొంతమంది వద్దనుంచి డబ్బులు వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. కాగా కొడుకులు అర్జున్, రాజీవ్‌లు చేస్తున్న సెక్స్ ట్రాప్ దందా గురించి తల్లి మీనాకుమారికి, మేనమామ ప్రశాంత్‌తో పాటు ఇతరులకు తెలిసిన తర్వాత వారు కూడా ఈ రాకెట్లో పాలుపంచుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు ఆధారాలు సేకరించారు.
కాగా సంపన్న యువతులను ట్రాప్ చేస్తున్న ముఠా వెనుక మరికొంతమంది వ్యక్తులు ఉండి నగరంలోని సంపన్నుల కుమార్తెలను ‘టార్గెట్’ చేయిస్తున్నారనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఖరీదైన కార్లను అద్దెకు తీసుకుని యువకులకు సమకూర్చడం.. లగ్జరీ లైఫ్‌ైస్టెల్ అనుభవిస్తున్నట్లు భ్రమింపజేస్తూ పబ్స్, రెస్టారెంట్లలో భారీగా పార్టీలు చేసుకోవడం ద్వారా యువతులను, మైనర్ బాలికలను ఆకర్షిస్తున్నారని తేలింది. ప్రధాన నిందితుడైన అర్జున్ కూకట్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటూ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు అతడి సోదరుడు రాజీవ్ సైతం సెక్స్ ట్రాప్‌లో సహకరిస్తున్నాడని, తల్లి మీనాకుమారి బ్యాంక్ అకౌంట్లోకి భారీగా డబ్బులు వచ్చినట్లు పోలీసులు తేల్చారు. మీనాకుమారి సోదరుడైన ప్రశాంత్‌తోపాటు అమెకు సన్నిహితంగా ఉండే వినీల్ చౌదరి బ్యాంక్ అకౌంట్స్, వాట్సప్ చాటింగ్స్‌ను పరిశీలించగా భారీ రాకెట్ కొనసాగుతున్నట్లు తేలింది.
ఈ మొత్తం సెక్స్ ట్రాప్ రాకెట్లో సుమారు 15 నుంచి 20మంది దాకా యువకులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం యువతుల వద్దనుంచి డబ్బులు లాగడమే లక్ష్యమా.. లేకుంటే సెక్స్ ట్రాప్‌కు గురైన సంపన్నుల పిల్లల వీడియోలు తీసి కుటుంబ సభ్యులను బ్లాక్మెయిల్ చేసి కోట్లలో డబ్బులు దండుకునే ప్రణాళిక ఉందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సెక్స్ ట్రాప్ వలలో పడిన యువతుల సంఖ్య వందల్లో ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో టాస్క్‌ఫోర్స్‌తో పాటు ఉమెన్ సేఫ్టీ సెల్ అధికారులు సైతం దర్యాప్తులో పాల్గొని మొత్తం ముఠా గుట్టును బయటపెట్టాలని సీపీ ఆదేశించడంతో స్వయంగా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.