చంపాపేట : డివిజన్ పరిధిలోని కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయానికి మంగళవారం ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో భారులు తీరారు.
ఆలయంలోని శ్రీ నాగేశ్వర, శ్రీ స్పటిక లింగేశ్వర, శ్రీ విశ్వనాథస్వాముల ఆలయాల్లో నిర్వహించిన రుద్రాభిషేకాల్లో, రుద్రహోమ కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రర్ధలతో శివలింగాలకు క్షీరాభిషేకాలు చేసి పూజలు నిర్వహించారు.
ఈ వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణమంత భక్తులతో కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారిణీ దీప్తిరెడ్డి, ఆలయ మాజీ ధర్మకర్తలు నాయకులు మధుసాగర్ తదితరులు పాల్గొన్నారు.