మహేశ్వరం : శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని మంత్రి చాంబర్లో జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్ ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె అన్నారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఆమె అన్నారు.
బ్రహ్మోత్సవాలను సజావుగా జరిగేందుకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఆమె తెలిపారు. అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన గోడపత్రిక, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, ఎంపీడీవో నర్సింలు, సీఐ మధుసూధన్, ఈవో మురళీకృష్ణ మాజీ సర్పంచ్ ఆనందం నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్, వర్కల యాదగిరిగౌడ్, కందిరమేష్, దోమశ్రీనివాసరెడ్డి, దిద్దెల అశోక్‌కుమార్, కుమార్, శ్రీను, దుడ్డు కృష్ణ, రాజుయాదవ్, కటికల శ్రీనువాస్, మైసయ్య, చందు, తదితరులు పాల్గొన్నారు.