అల్వాల్ : మహా శివరాత్రి ఈ సందర్భంగా ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 28న పార్వతీపరమేశ్వరుల కల్యాణ మహోత్సవం జరుగనున్నది. అదే రోజు సాయంత్రం పల్లకీసేవ, మరుసటి రోజు (మహాశివరాతి)న మహాకాల రుద్రాభిషేకం, ఏకబిల్వ అఖండ బిల్వ సహిత రుద్రాభిషేకం, బుధవారం రోజున అన్నదాన కార్యకమం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ కొడారి నర్సింగరావు, పధానార్చకుడు విరివెంటి రాజశేఖర్ శర్మ వివరించారు.