సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక ఆభరణాల సంస్థ శివ నారాయణ్ జ్యువెలర్స్‌ను ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఎక్స్‌లెన్స్ ఇన్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అవార్డుతో సత్కరించింది. శివ నారాయణ్ జ్యువెలర్స్ ప్రదర్శించిన అసాధారణ హస్తకళ.. సృజనాత్మక నైపుణ్యాన్ని గుర్తిస్తూ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందజేశారు.
శివ నారాయణ్ జ్యువెలర్స్ అంతర్జాతీయ మార్కెట్‌ను ఆకర్శించడానికి నాలుగు దిగ్గజ కళాఖండాలను రూపొందించిందని, ఆధునిక సాంకేతిక పురాతన పద్ధతుల సమ్మేళనంతో గణేశ్ లాకెట్, రామ్ దర్బార్ లాకెట్, ఏడు పొరల(ది సట్లడ) నెక్లెస్, భూతద్దంలు ఇందులో ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ విశిష్ట ఆభరణాల తయారీతో ఎఫ్టీసీసీఐతోపాటు మంత్రి కేటీఆర్ అభినందనలు అందుకోవడం అనిర్వచనీయమన్నారు.