ఐసీఎంఆర్‌లో షేరింగ్ ఫెసిలిటీ
లైఫ్ సైన్సెస్ రంగంలో యువ పరిశోధకులు, ఆంత్రప్రె న్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
- తీరనున్న నిర్వహణ భారం
- యువ పరిశోధకులు,ఆంత్రప్రెన్యూర్లకు ప్రయోజనం
- వినూత్న విధానానికి ప్రణాళికల రూపకల్పన
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో యువ పరిశోధకులు, ఆంత్రప్రె న్యూర్లకు ప్రయోజనం చేకూర్చేలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. జాతీయ స్థాయిలో ఉన్న ఐసీఎంఆర్ పరిశోధన కేంద్రాల్లోని ల్యాబోరేటరీలను ఇతరులు కూడా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. రీసెర్చ్ వర్క్ స్పేస్ షేరింగ్ ఫెసిలిటీ పేరిట కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ వేదికగా ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా మరో 21 సెంటర్లు వివిధ అంశాలపై పనిచేసే పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయా సెంటర్లలో ఆధునాతన సౌలతులు, ల్యాబోరేటరీ మెషనరీతోపాటు పరిశోధనలకు అవసరమైన సకల వసతులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆయా సెంటర్లలో పనిచేసే పరిశోధకులు, సైంటిస్టులు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉంది. ఇకపై జాతీయ స్థాయిలో ఉన్న యంగ్ ఆంత్రప్రెన్యూర్లు, రీసెర్చ్ ఫెలో కూడా వినియోగించుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
మెరుగైన పరిశోధనలకు అవకాశం
ఈ విధానం అమలుల్లోకి వస్తే టైర్- 2 సిటీల్లోనూ మెరుగైన పరిశోధనలు జరిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆయా కేంద్రాల్లోని ఆధునాతన ల్యాబోరేటరీలను వినియోగించుకునే వీలు ఉంటుంది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోపాటు, స్టార్టప్ నిర్వాహకులు, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. పరిశోధన రంగంలో మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతోపాటు.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా అకాడమీ, రీసెర్చ్ ల్యాబోరేటరీలకు అనుసంధానం చేయడంలో కీలకంగా మారుతుందని చెబుతు న్నారు. దీంతో పరిశోధనల్లో నాణ్యత ప్రమాణాలు కూడా పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఖరీదైన ల్యాబోరేటరీ సేవలను కూడా తక్కువ ధరలో, ఎలాంటి నిర్వహణ భారం తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
నిబంధనలు వర్తిస్తాయి..
దేశంలో వైద్య విజ్ఞాన రంగంలో కీలకమైన ఐసీఎంఆర్ ప్రయోగశాలలను వినియోగించుకోవాలంటే కొన్ని నిబంధనలతో కూడిన అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల్లో ఉండే పరికరాల వివరాలను పీ-రైజ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతోపాటు వీటిని ఐసీఆర్ఎం సెంట్రల్ యూనిట్ నుంచి పర్యవేక్షిస్తోంది. ఆయా కేంద్రాల్లో జరిగే పరిశోధనలు, చార్జీల వివరాలతోపాటు నిర్ణీత కాలపరిమితి వంటి నిబంధనలతో కూడిన షేరింగ్ ల్యాబోరేటరీ విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

