Shahar ki Baat | బీఆర్ఎస్ సర్కార్ పుణ్యమాని ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలలో పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం అందుతున్నది. ఉచిత వైద్యంతోపాటు మందులను కూడా అందజేస్తుండడంతో పేదోళ్లకు ఎంతో మేలు జరుగుతున్నది. గిన్ని బస్తీ దవాఖానలు వస్తయని ఎవ్వరం అనుకోలేదని, ముఖ్యంగా బీపీ, షుగర్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా బస్తీ దవాఖానల్లో చూస్తున్రు. ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి క్యాన్సర్ రోగులను గుర్తించి మందులను ఇస్తున్రు. ‘టిమ్స్ పేరుతో అల్వాల్లో పెద్ద దవాఖానను కడుతున్నరు. అది పూర్తయితే ఇగ ప్రైవేటు దవాఖానలకు పోవుడు పూర్తిగా తప్పుతది’.
అద్భుతమైన కంటి వెలుగు పథకం అమలు చేసి సీఎం కేసీఆర్ కంటి వెలుగైండు. నూటికి నూరు శాతం కంటి సమస్యలు తీరినయ్. కేసీఆర్ కిట్ నుంచి ఆసరా పింఛన్ల వరకు అనేక మందికి బీఆర్ఎస్ సర్కార్ అండగా నిలుస్తున్నది. లెక్కకు మించిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదలకు ఆరాధ్య దైవంగా మారిండు.
-ఆస శ్రీరాములు,వెంకటాపూర్, అల్వాల్