ంపేట్, ఆగస్టు 6: వేర్వేరు ఘటనల్లో యువతులు లైంగికదాడికి గురయ్యారు. బేగంపేట్ పీఎస్ పరిధిలో మంగళవారం ఇద్దరు యువతులు తమపై జరిగిన లైంగికదాడి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ (28) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.
ఆ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మబలికి, జూన్ 24న బేగంపేట్‌లోని ఓ హోటల్‌కు తీసుకువచ్చి రాజ్‌కుమార్ లైంగికదాడి చేశాడు. అక్కడి నుంచి వెళ్లిపోయిన యువతికి ఫోన్ చేసి మరోసారి హోటల్‌కు రావాలని బెదిరించాడు. యువతి నిరాకరించడంతో రాజ్‌కుమార్ దుర్భాషలాడాడు. దీంతో మానసిక వేదనకు గురైన బాధితురాలు ఈ నెల 4న దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును బేగంపేట్ పీఎస్‌కు బదిలీ చేశారు.
యువతిపై లైంగికదాడి చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిపై బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువతి (29)కి వరంగల్ జిల్లా గుండ్ల సింగారానికి చెందిన కందుకూరి ప్రశాంత్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో తన ఉద్యోగం, బైక్ కొనుగోలు, అవసరాల నిమిత్తం డబ్బులు కావాలంటూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు.
పెద్ద మొత్తంలో ఉన్న ప్రశాంత్ అప్పులను తీర్చేందుకు పలు సార్లు రూ. 14.60 లక్షల వరకు బాధితురాలు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌లోని ఓ గదికి తీసుకువచ్చి లైంగికదాడి చేశాడు. ఆ తరువాత పెళ్లి చేసుకోవాలని అడిగితే బాధితురాలిపై దాడి చేసి, కులం పేరుతో దూషించాడు. పెళ్లి విషయం దాట వేస్తూ, తప్పించుకుని తిరుగుతుండటంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.