ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి
ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేసి శారీరకంగా లోబర్చుకుని.. ఆ తర్వాత అందినకాడికి తీసుకుని ఉడాయింపు.. ఆరు నెలల వ్యవధిలో సుమారు ఐదారు మందితో ఎఫైర్స్ నడుపుతూ సెక్స్ట్రాప్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లో నివాసం ఉండే మామలకుంట పవన్ అలియాస్ తరుణ్(22) కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పలువురు బాలికలు, యువతులను స్నేహం పేరుతో ముగ్గులోకి దించాడు.
- ఇన్స్టాగ్రామ్ వేదికగా సెక్స్ట్రాప్
- నిందితుడిని అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు
బంజారాహిల్స్,జూలై 25: ప్రేమ పేరుతో మైనర్లను ట్రాప్ చేసి శారీరకంగా లోబర్చుకుని.. ఆ తర్వాత అందినకాడికి తీసుకుని ఉడాయింపు.. ఆరు నెలల వ్యవధిలో సుమారు ఐదారు మందితో ఎఫైర్స్ నడుపుతూ సెక్స్ట్రాప్ చేస్తున్న నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్లో నివాసం ఉండే మామలకుంట పవన్ అలియాస్ తరుణ్(22) కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పలువురు బాలికలు, యువతులను స్నేహం పేరుతో ముగ్గులోకి దించాడు. వారితో చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు వారిని లోబర్చుకుని లైంగికదాడి చేస్తున్నాడు.
కొన్నాళ్ల తర్వాత వారివద్ద నుంచి ఏదో ఒక సాకుతో డబ్బులు, లేకుంటే బంగారం తీసుకుని ముఖం చాటేస్తున్నాడు. ఇదే తీరులో బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న బాలిక(17)ను గత డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకుని ఈ ఏడాది జనవరిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్నిరోజుల తర్వాత పెళ్లి చేసుకుందామంటూ నమ్మబలికి ఆమె వద్ద 2తులాల బంగారం ఆభరణాలు తీసుకుని ఉడాయించాడు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి 3న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు పవన్‌పై పోక్సో చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో జడ్చర్ల ప్రాంతానికి చెందిన మరో యువతిని(19)ని ప్రేమిస్తున్నట్లు నమ్మించిన పవన్ 4 నెలల క్రితం ఆమెను అదే ప్రాంతంలో గుళ్లో పెళ్లి చేసుకుని అక్కడే తాండాలో నివాసం ఉంటున్నాడు.
కాగా బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన పోక్సో కేసులో భాగంగా నిందితుడి కోసం గాలి స్తున్న పోలీసులకు ఇన్‌స్టాగ్రామ్‌లో లభ్యమైన క్లూ ద్వారా పవన్ స్నేహితుడి అచూకీ దొరికింది. అతడి ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పవన్ పెళ్లి చేసుకున్న యువతి ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అందులోని ఫోన్ నెంబర్ ఆధారంగా పరారీలో ఉన్న పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని ఓ ఇంట్లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న బాలిక(16)ను సైతం లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడగా, పవన్‌పై మరో పోక్సో కేసు నమోదైందని, అరెస్టయి 2 నెలల పాటు జైల్లో ఉండివచ్చాడని పోలీసుల విచారణలో తేలింది. ఇతడి చేతిలో చాలామంది యువతులు మోసపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలో చోటు చేసుకున్న రిచ్‌కిడ్స్ సెక్స్ట్రాప్ వ్యవహారం తరహాలోనే పవన్ తీరు ఉందని, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెడుతూ ఖరీదైన బైక్‌లు నడిపిస్తున్నట్లు నమ్మించి అనేకమందిని లోబర్చుకున్నాడని తెలుస్తున్నది. తప్పించుకు తిరుగుతున్న పవన్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ శ్రీనివాస్‌తోపాటు హెడ్‌కానిస్టేబుల్ సుభాష్, కానిస్టేబుల్ దత్తులను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

