అనన్య సామాన్యం.. ఈ అక్షర సంకల్పం
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయం ద్వారా పేద విద్యార్థులతో అక్షర సేద్యం చేయిస్తోంది. పుస్తక పఠనం ప్రాధాన్యతను చాటుతూ ప్రశంసలందుకుంటున్నది.
- పేద విద్యార్థుల కోసం స్టోరీస్ ఆన్ వీల్స్.. మొబైల్ లైబ్రరీ ఏర్పాటు
- వినూత్న ఆలోచనతో ఆదర్శంగా నిలిచిన అనన్య
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్‌తో టెక్ కంపెనీలను ఆకట్టుకుంటున్న ఇంటర్ స్టూడెంట్
- యాజమాన్యాలను ఒప్పించి నిధుల సేకరణ
- ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు అందజేత
- ఈ నెల 20 వరకు బుక్ డొనేషన్ డ్రైవ్
సమాజానికి సేవ చేయాలన్న తపన అందరికీ ఉంటుంది.. కానీ.. ఆ సంకల్పానికి రూపమిచ్చేది మాత్రం కొందరే. అలా ఓ విద్యార్థిని తనకు తట్టిన ఆలోచనకు కార్యరూపమే స్టోరీస్ ఆన్ వీల్స్. నగరానికి చెందిన అనన్య ఈ సంచార గ్రంథాలయం ద్వారా పేద విద్యార్థులతో అక్షర సేద్యం చేయిస్తోంది. పుస్తక పఠనం ప్రాధాన్యతను చాటుతూ ప్రశంసలందుకుంటున్నది. కదిలే చక్రాలు అనేక కథలు చెబుతాయంటూ.. బుక్ డొనేషన్ డ్రైవ్నూ చేపట్టింది. సోమవారం గచ్చిబౌలిలోని మీనాక్షి ట్రైడెండ్లో పుస్తకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ఈ పుస్తకాలన్నీ మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు అందజేయనున్నట్లు అనన్య తెలిపింది.
ఆమె నిరుపేద విద్యార్థుల కోసం ఏమైనా చేయాలనుకున్నది. ఆ ఆలోచనకు రూపమిచ్చి ప్రణాళికలు తయారు చేసింది. ఇలా మొదలైందే ఈ స్టోరీస్ ఆన్ వీల్స్ మొబైల్ లైబ్రరీ. నగరంలోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసిన అనన్య ఇప్పుడు సామాజిక సేవలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నది. అనన్య సామాన్యం..ఈ అక్షర సంకల్పం ఆలోచన అద్భుతం. ఈ విజ్ఞాన అంబులెన్స్ దారా పేద విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతున్నది. వారితో అక్షర సేద్యం చేయిస్తోంది. విభిన్న రకాల భాషల్లో సాహిత్యాన్ని అందిస్తున్నది. ఆ కదిలే చక్రాలు అనేక కథలు చెబుతాయంటూ.. నగరంలో బుక్ డొనేషన్ డ్రైవ్నూ చేపట్టింది. చాలా మంది తమ వద్ద ఉన్న పుస్తకాలు అనన్యకు విరాళంగా అందిస్తున్నారు. ఈ డ్రైవ్‌లో చేపట్టిన పుస్తకాలన్నీ ఆ విజ్ఞాన అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ)

అనన్య తన ఆలోచనను అమ్మానాన్నలకు చెప్పింది. వాళ్లు మంచి ఆలోచన అని భుజం తట్టారు. అయితే ఇందుకు తామేమైనా సాయం అందించాలా అని అడిగారు. ఇందుకు అనన్య తిరస్కరించింది. కారణం ఈ ‘స్టోరీస్ ఆన్ వీల్స్’ ఒక్క రోజు అందించే సేవ అని ఆమె అనుకోలేదు. ఇక మీదట అన్నీ ప్రాంతాలకు వెళ్లాలి. సాయం అనేది అందరూ అందించాల్సిన అవసరం ఉందనుకుంది. మంచి పనికోసం మంచి మనుషులు ఎప్పుడూ ముందుంటారని విశ్వసించిన అనన్య తన ఆలోచనకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. పిల్లల అవసరాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా వారికి అండగా నిలబడగలం? మన సాయం వారి ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తుందనే సందేశంతో ప్రణాళికలు తయారు చేసుకుంది. అలా ఒక్క రూపాయి తాను ఖర్చు పెట్టకుండా కేవలం ఒక మంచి ఆలోచనే పెట్టుబడిగా మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్‌ను సఫలం చేసింది అనన్య. పాడైన అంబులెన్స్‌కు మరమ్మతులు చేయించి మొబైల్ లైబ్రరీగా మార్చింది. టెక్ కంపెనీలను సందర్శించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్‌తో వారిని సేవకు ముందుకొచ్చేలా ఒప్పించింది. అలా వారి నుంచి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు సేకరించింది. ఇప్పటికీ అనన్య అనేక కంపెనీలు, బిజినెస్ సంస్థలను కలిసి ప్రజెంటేషన్లను ఇస్తూనే ఉంది. ఇప్పటికే కొన్ని స్కూల్స్‌లో మొబైల్ లైబ్రరీ సేవలు అందిస్తుండగా ఇప్పుడు మరిన్ని పుస్తకాల సేకరణ, ఇతర సామగ్రి కోసం ఆ లైబ్రరీ వాహనం నగరానికి విచ్చేసింది.
ఆలోచన వచ్చింది ఇలా..
అది 2020 జనవరి 7… అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లిన అనన్య అక్కడ తన తల్లి సౌమ్య చదువుకున్న పాఠశాలకు సరదాగా వెళ్లింది. అది కరీంనగర్ జిల్లాలోని బోయినిపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ పాఠశాల. ఆ స్కూల్‌కు తాను చదువుకుంటున్న స్కూల్‌కు మధ్య ఉన్న తేడాలను పరిశీలించిన ఆ విద్యార్థి ఆలోచనలో పడింది. ఆ ప్రభుత్వ విద్యార్థుల కోసం ఏదైనా చేయాలని అనుకుంది. అక్కడి విద్యార్థులతో వారి అవసరాల గురించి ఆరా తీసింది. ఆ పిల్లలకు లైబ్రరీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల అవసరం ఉందని గుర్తించింది. అలా మొదలైందే “స్టోరీస్ ఆన్ వీల్స్” మొబైల్ లైబ్రరీ కాన్సెప్ట్.
ఆదర్శంగా అనన్య..
ఓవైపు చదువు..మరోవైపు సామాజిక బాధ్యత. రెండింటిలో చురుకుగా సాగుతూ అనన్య ఆదర్శంగా నిలుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తకాల సేకరణ చేపట్టింది. ఆదివారం మాదాపూర్‌లోని ఫార్చూన్ టవర్స్‌లో డ్రైవ్ ముగిసింది. సోమవారం మీనాక్షి ట్రైడెండ్లో అనన్య పుస్తకాల సేకరణ చేపట్టింది. దీనికి విశేష స్పందన వచ్చింది. ఈనెల 18న రాంకీ టవర్స్, 19న టెజెండ్ చైమ్స్, 20న రాజ్పుష్పలో డ్రైవ్ జరుగుతుంది. అనన్య సోషల్ మీడియాలో తాను చేపట్టే కార్యక్రమాలను పోస్టు చేస్తూ ఫండ్ సేకరణ చేస్తూ.. నిరుపేద పిల్లలకు కావాల్సిన సామగ్రిని అందిస్తుంది. కథల పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన బుక్స్, ఆధ్యాత్మికం, నవలలు, కవిత్వ రచనలు ఇలా అనేక రకాల పుస్తకాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 12 వందల పుస్తకాలు సేకరించారు.

అందరి సహకారంతోనే స్టోరీస్ ఆన్‌వీల్స్
మా అమ్మ చదువుకున్న పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడి విద్యార్థులకు కావాల్సిన అవసరాలను తెలుసుకున్నాను. వారంతా మంచి ప్రతిభతో ఉన్నారు. వారికి లైబ్రరీ, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌లు అందిస్తే మరింత రాణిస్తారు. అందుకే నేను ఈ కార్యక్రమం చేపట్టాను. మంచి పనికి అందరూ సాయం అందించడం వల్లే ఈ కాన్సెప్ట్ విజయవంతంగా కొనసాగుతుంది. మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి యాక్టివిటీలో నాకు ఎంతగానో అండగా నిలుస్తున్న మా అమ్మానాన్నలకు థాంక్యూ.
– అనన్య పొల్సాని, ఫౌండర్, స్టోరీస్ ఆన్ వీల్స్

అనన్యను చూస్తే చాలా సంతోషంగా ఉంది
అనన్య చిన్నప్పటి నుంచి సేవ చేయడం పట్ల బాగా ఆకర్షితురాలయ్యేది. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే బాధపడేది. వారి కోసం తనకు వీలైన సాయం అందించేది. మా ఊరు వెళ్లిన అనన్య అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించడం వారి అవసరాలను తెలుసుకుని సాయం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది.
– సౌమ్య (అనన్య తల్లి)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

