గౌతంనగర్, డిసెంబర్ 22 : మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్(ఎంఎస్ఎస్వో) ట్రస్టుతోనే పేదలకు సేవలందించడంతోపాటు వారికి విద్య, వైద్యానికి ఆర్థిక సహా యాన్ని అందిస్తున్నామని ట్రస్టు చైర్మన్ మైనంపల్లి రోహిత్బాబు అన్నారు. గురువారం గౌతంనగర్ డివిజన్ , ఇందిరానెహ్రూనగర్కు చెందిన వికలాంగుడు లక్ష్మణ్ కుటుంబానికి నిత్యావసర సరుకులు, పిల్లలకు నోటు బుక్స్తో పాటు రూ.5వేలను ఆయన అందించా రు. ఈ సందర్భంగా రోహిత్బాబు మాట్లాడుతూ.. ట్రస్టు ద్వార పేదలకు సేవలంది స్తు న్నామని తెలిపారు. పేద విద్యార్థుల చదువు, వైద్య ఖర్చులను ట్రస్టు భరిస్తుందన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ట్రస్టు ముం దుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్, బీఆర్ఎస్ నాయకులు మేకల రాముయాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.