CM KCR Birthday | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు : ఎమ్మెల్యే ముఠా గోపాల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.
చిక్కడపల్లి : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా 15, 16, 17 తేదీలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. సోమవారం గాంధీనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ 68 జన్మదిన సంబురాలను ఘనంగా నిర్వహంచడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 15వ తేదీన అస్పత్రులు, వృద్ధాశ్రమాలు,అనాథాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
16 తేదీన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, 17వ తేదీన సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం,గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్,యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్,గాంధీనగర్ ,రాంనగర్, కవాడిగూడ, అడిక్‌మెంట్, ముషీరాబాద్ డివిజన్ల్ పార్టీ అధ్యక్షులు ఎం.రాకేశ్, రావులపాటి మోజస్,శ్యామ్ యాదవ్,శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ ప్రసాద్,నాయకులు శ్రీకాంత్, ఎరం శ్రీనివాస్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, శ్యామ్ సుందర్, సాయి, సురేందర్,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

